మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లపై ఉద్యోగులు ఫైర్

Update: 2023-07-02 04:32 GMT

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తమ CEO సత్య నాదెళ్లపై మండిపడుతున్నారు. గురువారం.. కంపెనీ సాధించిన ఆర్ధికలాభాల గురించి ప్రస్తావిస్తూ. .. ఫైనాన్షియల్ ఇయర్ 23లో మైక్రోసాఫ్ట్‌ సాధించిన విజయాల గురించి ఉద్యోగులకు అంతర్గతంగా చేసిన మెసేజే ఇందుకు కారణమవుతోంది. ChatGPTలో పెట్టుబడి కారణంగా మంచి వృద్ధిని నమోదు చేసిందని ఆ మేసేజ్ సారాంశం. కంపెనీ టాప్ మేనేజ్మెట్ చేసిన ఈ మేసేజ్ చూసి సంతోషించాల్సిన ఉద్యోగులు కాస్త ఫైర్ అయ్యారు. అందుకు కారణం కంపెనీలో లేఆప్స్, జీతాల పెంపు నిలిపివేత. ఈ రెండు విషయాల పట్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

CEO సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ సాధించిన విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. కంపెనీకి 'ల్యాండ్ మార్క్ ఇయర్'గా పేర్కొన్నారు. సంస్థ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఉద్యోగుల సృజనాత్మకత, ఆవిష్కరణల వల్ల బలమైన వృద్ధిని సాధించామంటూ సిబ్బందిని ప్రశంసించారు. కానీ సంతోషించాల్సిన ఉద్యోగులు కాస్తా CEOకు షాక్ ఇచ్చారు. వేతనాల పెంపును నిలిపివేయడం సహా 10 వేల మంది తొలగింపు ప్రకటనపై మండిపడ్డారు. కానీ యాక్టివిజన్ బిజార్డ్ కొనుగోలు ఒప్పందం కోసం 69 బిలియన్ డాలర్లు వెచ్చించడాన్ని తప్పుపట్టారు.

'కష్టపడి కంపెనీ వృద్ధికి తోడ్పడినందుకు వేతనాల పెంపును నిలిపివేస్తూ కృతజ్ఞత చూపించడమే కరెక్ట్' అంటూ ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ వ్యాఖ్యకు 250కు పైగా అప్‌ వోట్స్ రావడం విశేషం. 'ఒకపక్క లక్షాధికారులైన అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్స్ లాభాలు ఆర్జిస్తుంటే, సిబ్బంది వేతనాల్లో మాత్రం కోత విధించడం దారుణం' అని మరో ఉద్యోగి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిపింది.




Tags:    

Similar News