సార్వత్రిక ఎన్నికలకు నగారా..దేశవ్యాప్తంగా ఇంటి నుంచి ఓటింగ్ అమలు

Byline :  Vamshi
Update: 2024-03-16 10:17 GMT

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. 18వ లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక తేదీలను ఈసీ ప్రకటిస్తుంది. ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16తో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది.

అనంతరం షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. దేశంలో 96.88 కోట్లు మంది ఓటర్లున్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇది అమెరికా, ఆస్ట్రేలియా, వంటి దేశాల్లోని జనాభాను కలిపిన ఎక్కువన్నారు. ఇక 10.5 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1.50 కొట్ల మంది ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ ఆఫీసర్ల విధుల్లో పాల్గొనున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం అమలు కానుంది. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో పరీక్షించిన ఈ సౌకర్యం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News