26వేళ్లతో పుట్టిన చిన్నారి.. దేవతని కొలుస్తూ పూజలు

Byline :  Bharath
Update: 2023-09-17 16:58 GMT

రాజస్థాన్, డీగ్ జిల్లాలోని కామా పట్టణంలో వింత ఘటన జరిగింది. ఓ చిన్నారి 26 వేళ్లతో పుట్టింది. దాంతో ఆ చిన్నారిని దేవతగా భావిస్తున్న కుటుంబ సభ్యులు, ఊరి ప్రజలు పూజలు చేస్తున్నారు. ఆ శిశువుకు ఒక్కో చేతికి 7 వేళ్లు, రెండు పాదాలకు 12 వేళ్లు ఉన్నాయి. దీనిపై పరీక్షలు జరిపిన వైద్యులు 26 వేళ్లుంటే నష్టమేం లేదని, జన్యుపరమైన లోపం వల్లే ఇలా పుట్టిందని చెప్తారు. గోపాల్ భట్టాచార్య, సర్జూ దేవి దంపతులకు ఈ శిశువు జన్మించింది. శనివారం రాత్రి సర్జూ దేవి ఎనిమిది నెలలకే ప్రసవించింది. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన చిన్నారికి 26 వేళ్లు ఉండటం చూసి అంతా ఆశ్యపడ్డారు. మొదట ఆందోళన చెంది వైద్యులను సంప్రదించారు. దీనిపై వివరణ ఇచ్చిన డాక్టర్లు ఏం ప్రమాదం లేదని చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. జనాలంతా ఆ శిశువును ధోలగర్ దేవి అవతారంగా భావించి సంబరాలు చేసుకుంటున్నారు.




 




Tags:    

Similar News