ప్రియుడి మార్మాంగాన్ని కోసిన యువతి.. మరో 15 రోజుల్లో పెళ్లి.?

ప్రియుడి మార్మాంగాన్ని కోసిన యువతి.. మరో 15 రోజుల్లో పెళ్లి.?;

Update: 2023-06-09 03:18 GMT


బీహార్‌లోని పట్నాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనను మోసం చేశాడని ప్రియుడి మర్మంగాన్ని కోసేసింది ఓ యువతి. సదరు బాధితుడు సిఆర్పిఎఫ్ జవాన్ అని, ఛత్తీస్ గఢ్‌లో విధుల్లో ఉన్నట్లు తెలిసింది. గత మూడేళ్లుగా తన బంధువుల అమ్మాయితో ప్రేమలో ఉన్న అతను.. మూడేళ్ల సహజీవనం తర్వాత.. ప్రియురాలని రహస్య వివాహం చేసుకున్నాడు. అయితే మళ్లీ మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలిసిన ప్రియురాలు ఈ దారుణానికి ఒడిగట్టింది.

ఈ నెల 23వ తేదీన మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ జవాను. ఈ విషయం కాస్త యువతికి తెలిసి.. తీవ్ర మనోవేదనకు గురైంది. దీనికంతటికీ ప్రియుడే కారణమని గట్టి ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే పట్నాలోని హోటల్ కి రమ్మని అతడిని పిలిచింది. పిలిచిన వెంటనే వచ్చాడా జవాను. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ప్లాన్ ప్రకారం మాయ చేసి పదునైన కత్తితో అతని మార్మాంగాన్ని కోసేసింది. పని అయ్యాక వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంది. విషయం పోలీసులకు చేరడంతో ఆమె మీద కేసు నమోదు చేసి.. అరెస్టు చేశారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో 15 రోజుల్లో పెళ్లి ఉండడంతో ఈ దారుణం.. ఇరు కుటుంబాల్లో పెద్దగా ఘర్షణకు దారి తీసింది.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.



Tags:    

Similar News