పైన పటారం లోన లొటారం అన్న చందంగా తయారయింది ఎన్నారై పెళ్ళికొడుకుల వ్యవహారం. విదేశాల్లో ఉంటున్నారు కదా మంచి సంబంధం అని అమ్మాయిలను ఇచ్చి పెళ్ళిళ్లు చేస్తుంటే మోసాలు చేస్తున్నారు. ఇలా మోసపోయిన లిస్ట్ లో గుజరాత్, సంజాబ్, తెలంగాణ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు.
విదేశాల మోజులో డి అమ్మాయిల జీవితాలను పణంగా పెడుతున్నారు తల్లిదండ్రులు. అమ్మాయి సుఖపడుతుందని అనుకుంటున్నారే కానీ విదేవాల వెనుక ఉన్న మోసాలను గ్రమించలేకపోతున్నారు అంటోంది జాతీయ మహిళా కమిషన్. ఎన్నారై వివాహాలకు సంబంధించిన చాలా మోసాలు వెలుగులోకి వస్తున్నాయని చెబుతోంది. విదేశాల్లో ఉంటున్నారు కానీ సరిగ్గా స్థిపడడం లేదు చాలా మంది అబ్బాయిలు. మరోవైపు అక్కడ వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉండి పేరెంట్స్ బలవంతంతో ఇక్కడ అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటూ వాళ్ళ గొంతు కోస్తున్నారు. ఇక చదువుకున్న వారు అయి ఉండి కూడా శాడిస్టుల్లా ప్రవర్తిస్తూ భార్యలను చిత్రహింసలు పెడుతున్న ఎన్నారైలకూ కొదవ లేదు. విదేశాల్లో ఉండి విడాకులు తీసుకుంటున్న వారూ ఎక్కువే ఉన్నారని అంటోంది మహిళా కమిషన్.
గుజరాత్, పంజాబ్, తెలంగాణలకు చెందిన అమ్మాయిలు ఎక్కువగా ఎన్నారై సంబంధాలు చేసుకుని మోసపోతున్నారని చెబుతున్నారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖాశర్మ. ముందు వెనుకా చూసుకోకుండా...అబ్బాయి గురించి సరిగ్గా విచారించకుండా పెళ్ళిళ్ళు చేయడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పాడుతోందని చెబుతున్నారు. సంబంధాలు కుదుర్చుకునేప్పుడు ఒకటికి పదిసార్లు అబ్బాయి వారి తల్లిదండ్రుల గురించి విచారించాలని రేశాశర్మ సలహా ఇస్తున్నారు. అబ్బాయి వివరాలు పూర్తిగా తెలుసుకునేందుకు అతను ఉండే దేశంలో భారత రాయబార కార్యాలయానికి లేఖ రాయొచ్చని చెబుతున్నారు.
ఎన్నారైలను పెళ్ళి చేసుకుని మోసపోయిన మహిళల కేసులు రాష్ట్ర ప్రభుత్వ మహిళా భద్రతా విభాగానికి చాలా వస్తున్నాయి. 2019 ఆగస్టు నుంచి 2022 డిసెంబర్ వరకూ 313 ఫిర్యాదులు అందాయ. ఒక్క 2022లో 85 మంది అమ్మాయిలు ఎన్నారై పెళ్ళితో వేధింపులకు గురైనట్లు కేసులు పెట్టారు. హరియాణా, పంజాబ్ లలో అయితే 32 వేలమందికి పైగా ఇలా మోసపోయినవాళ్ళు ఉన్నారు. పెళ్ళి చేసుకుని మోసం చేసిన ఎన్నారై పాస్ పోర్ట్ లను సీజ్ చేయాలని వచ్చిన ఫిర్యాదులతో లెక్క తేలింది. పంజాబ్ లో ఒక అమ్మాయి తనలా ఎవరూ మోసపోకూడదని ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. ఇందులో ఇప్పటి వరకు 700 వందల మంది అమ్మాయిలు ఫిర్యాదులు చేశారు.
అబ్బాయిలను, వారి తల్లిదండ్రులను గుడ్డిగా నమ్మడం వల్లనే ఇలా మోసాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. విదేవాలకు వెళ్ళే ముందు, వెళ్ళిన తర్వాత కూడా అక్కడి చట్టాలను తెలుసుకోవాలని చెబుతున్నారు. అబ్బాయిలు అడగ్గానే అస్తులు రాసిచ్చేయకూడదని సలహా ఇస్తున్నారు. కొందరు ఇక్కడ పెళ్ళి చేసుకని విదేశాలకు వెళ్ళాక విడాకులు ఇస్తున్నారు. అలా చేస్తే అవి చెల్లవని..ఇక్కడ జరిగిన పెళ్ళికి ఇక్కడే విడాకులు తీసుకోవాలని చెబుతున్నారు. దీని గురించి అమ్మాయిలకు పూర్తి అవగాహన అవసరం అంటున్నారు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డిఐజీ సుమతి.