ఒడిశా రైలు ప్రమాదం...గోవా-ముంబై వందే భారత్‌ ప్రారంభం రద్దు

Update: 2023-06-03 12:03 GMT

ఒడిశాలోని ఘోర రైలు ప్రమాదం కారణంగా గోవా-ముంబై వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం రద్దైంది. శనివారం ఉదయం దీనిని వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం మడ్గావ్ స్టేషన్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించని రైలు ప్రమాదంతో వందే భారత్ ప్రారంభాన్ని రద్దు చేశారు. మరొక రోజు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైళ్లు ఢీ కొన్న ఘటనలో 278 మరణించగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 178 మంది ఏపీ ప్రయాణికులు ఉన్నారు. 100కు పైగా విశాఖ వచ్చేందుకు రిజర్వేషన్లు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే వారి జనరల్ బోగిలో ఏపీకి చెందిన ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారి క్షేమసమాచారాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సిగ్నల్ లోపంతో ప్రమాదం

ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక వెల్లడించింది. సిగ్నల్ లోపం కారణంగానే జరిగినట్లు అంచనా వేసింది.ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఓ కమిటీని వేసింది. ఘటనస్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Goa-Mumbai Vande Bharat start cancelled

train accident,odissa,Goa-Mumbai Vande Bharat,start,cancelled,pm modi

Tags:    

Similar News