Gold And Silver Price Today : పసిడి ప్రియులకు కాస్త ఊరట.. తగ్గిన బంగారం ధరలు
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. వరుసగా రెండు రోజులుగా బంగారం ధరలు పెరగడంతో కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేసినవారికి కాస్త ఊరట లభించింది. బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ధరలు కాస్త శాంతించడంతో ఇవాళ దేశీయ మార్కెట్లో ధరలు దిగివచ్చినట్లు తెలుస్తోంది. గత రెండు సెషన్లలో రూ. 1100 మేర పెరిగిన బంగారం ధర ఇవాళ రూ. 450కి దిగిరావడంతో ఊరట కలిగినట్లయింది. వెండి రేటు సైతం ఇవాళ రూ. 800 మేర తగ్గింది.
ప్రస్తుతం మన దేశంలో పండగల సీజన్, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న క్రమంలో బంగారం, వెండి ఆభరణాలు, ముడి బంగారానికి మంచి గిరాకీ ఉంటుంది. ఈ క్రమంలోనే ధరలు ఆకాశాన్నంటుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇవాళ ధరలు తగ్గడం మంచి అవకాశమని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 490 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,300కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,510 వద్ద కొనసాగుతుంది.
దీనికితోడు వెండిధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 800 తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,700కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,700. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.77,700కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.75,500 వద్ద కొనసాగుతోంది.