పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Update: 2023-09-22 05:52 GMT

బంగారం కొనాలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్. గత 10 రోజులుగా బంగారం, వెండి ధరలు(Gold and Silver Rates)వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. అయితే, ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఈ పండుగల సీజన్‌లో బంగారం ధర దిగిరావడం చాలా మందికి ఊరటగానే చెప్పాలి. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి ప్రస్తుతం రూ. 55 వేల 50 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు రూ.180 పడిపోయి రూ. 60 వేల 50 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. బంగారం ధర తగ్గినప్పటికీ వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. అయితే, క్రితం సెషన్‌లో కిలో వెండి రేటు రూ.300 మేర దిగివచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ. 78 వేల వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు.. వెండి రేటు సైతం క్రితం సెషన్‌లో పడిపోయింది. ఇవాళ అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి వరకు పండుగలు కొనసాగుతాయి. దీంతో బంగారం ఆభరణాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ధరలు సైతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొన్ని సార్లు గ్లోబల్ మార్కెట్లు, దేశాల మధ్య దౌత్య పరమైన పరిస్థితుల వంటివి ఈ విలువైన ఖనిజాల ధరలపై ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగా ధరలు తగ్గడం, పెరగడం జరుగుతుంది. ప్రస్తుతం ఇవాళ ధరలు దిగిరావడం పసిడి ప్రియులకు శుభవార్తగా చెప్పాలి.

నోట్... బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.


Tags:    

Similar News