Gold price : భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?

Byline :  Veerendra Prasad
Update: 2024-02-16 02:07 GMT

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పెళ్లిళ్లు,ఇతర శుభకార్యలల్లో బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారంలో రూ.58 వేలు ఉన్న 22 క్యారెట్ 10 గ్రాముల ధర ఈరోజు రూ.56,890 గా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్‌ బంగారం ధర రూ.62,060 పలుకుతోంది.

వెండి ధర విషయానికొస్తే.. బంగారం తగ్గితే, వెండి ధరలు భారీగా పెరిగాయి.. వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. శుక్రవారం కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది.. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, జైపూర్, లక్నో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 74,000కి చేరింది. ఇక చెన్నైతో పాటు హైదారాబాద్‌ లో కూడా రూ. 75,500 గా ఉంది.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి.

ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.


హైదరాబాద్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.62,060

విజయవాడలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.62,070

విశాఖపట్నంలో 24 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.62,070




Tags:    

Similar News