Breaking News : సామాన్యులకు కేంద్రం రాఖీ గిఫ్ట్.. వంట గ్యాస్‎పై రూ.200 తగ్గింపు

Byline :  Aruna
Update: 2023-08-29 10:04 GMT

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుూస్తున్న వంట గ్యాస్ ధర తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సారి ఏకంగా సిలిండర్‎పై రూ.200 వరకు ధర తగ్గించింది. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో కేంద్రం గ్యాస్ ధరలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ సిలిండర్ ధర రూ.200 తగ్గించిన కేంద్రం ఉజ్వల యోజన కింద ఇచ్చిన సిలిండర్లకు రూ.400౦౦ రాయితీ ప్రకటించింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్ని కలు జరగనున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 



ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1100 ఉంది. మోదీ ప్రధాని కాక ముందు దీని ధర రూ. 450 ఉండేది. బీజేపీ ప్రభుత్వ హయాంలోని ఈ తొమ్మిదేళ్లలో గ్యాస్ ధరలు మూడింతలు పెరిగాయి. ఇది చాలదన్నట్లు నిత్యావసర వస్తువలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీని ప్రభావం మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా కనిపిస్తోంది.ఈ క్రమంలో గత కొంత కాలంగా గ్యాస్ ధరలు విపక్షాలకు ఒక అస్త్రంగా మారాయి. అందుకే రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విపక్షాలు గ్యాస్ ధరలపై మాట్లాడకుండా చేసేందుకు కేంద్రం సిలిండరుపై రూ.౨౦౦ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాఖీ పండుగ, ఓనం గిఫ్ట్ గా ఇవాళ్టి నుంచే తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

ఎన్నికల హామీలో భాగంగా ఈ మధ్యనే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాల్ గ్యాస్ సిలిండర్‎పై రూ.250 వరకు తగ్గిస్తామని ప్రకటించారు. తగ్గించిన ధరను నేరుగా మహిళల ఖాతాలో వేస్తామని తెలిపారు. ఇది మహిళలకు రాఖీ పండుగకు బహుమతి అని ప్రకటించారు.



Tags:    

Similar News