గుడ్‌న్యూస్..టమాట ధరలు తగ్గనున్నాయి..

Update: 2023-07-01 12:51 GMT

దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అందులో టమాట గురించి చెప్పక్కర్లేదు. సామాన్యులకు అందనంత స్థాయికి ఎగబాకింది. సెంచరీ క్రాస్ చేసి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. మార్కెట్లలో ప్రస్తుతం కేజీ టమాట రూ.125 పలుకుతోంది. దీంతో ప్రజలు లబోదిబో మంటున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్రం సామాన్యులకు శుభవార్త చెప్పింది. రానున్న రోజుల్లో టమాట ధరలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది. 15 రోజుల్లో ధరలు సాధరణ స్థాయికి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.




 


ఉత్పత్తి కేంద్రాల నుంచి పంట మార్కెట్లకు చేరడం, వివిధ ప్రాంతాల నుంచి సరఫరా పెరగడండో టమాట ధరలు దిగి వస్తాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సొలన్‌, సిర్‌మౌర్‌ జిల్లా నుంచి దిల్లీకి సరఫరాలు మెరుగైనందున టమాటా ధర తగ్గుతోందని చెప్పారు.

డిమాండ్ ఎక్కువగా ఉండి పంట తక్కువగా ఉండడటంలో టమాట కేజీ .100 దాటిందని వివరించారు. వాతావరణంలో మార్పులు కారణంగా టమాటా సరఫరాకు తీవ్ర కొరత ఏర్పాడిందన్నారు. టమాటాను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే వీలు ఉండదని, ఎక్కువ దూరం కూడా తరలించలేమని ఇలాంటి సమస్యల వల్లే నగరాల్లో విపరీతమైన కొరత వచ్చిందని రోహిత్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. టమాట ధరను తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేశారు.


Tags:    

Similar News