Governer Tamilisai : కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలి : గవర్నర్

Byline :  Krishna
Update: 2023-10-30 11:02 GMT

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని.. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. అభ్యర్థుల భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు. అటు సీఎం కేసీఆర్ సైతం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అంటే తనపై దాడి జరిగినట్లేనని చెప్పారు. హింసా రాజకీయాలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.


Tags:    

Similar News