సర్కారీ బడుల్లో చదివితే..మెడికల్ కాలేజీల్లో 5% రిజర్వేషన్

By :  Aruna
Update: 2023-09-19 14:33 GMT

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో వారికి 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు తాజాగా కీలక ప్రకటన చేశారు. నీట్ పరీక్ష కారణంగా గవర్నమెంట్ స్కూల్స్‎లో చదివే స్టూడెంట్స్ మెడికల్ ఎడ్యుకేషన్‎ను అభ్యసించలేకపోతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు వైద్య విద్య అందించేందుకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఈ సీట్లలో ప్రవేశానికి సర్కారీ బడుల్లో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులని సీఎం తెలిపారు.

1857 తిరుగుబాటులో గిరిజన దిగ్గజాలైన రాజు శంకర్‌షా , ఆయన కుమారుడు కున్వర్ రఘునాథ్ షాల స్మారకార్థం జబల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో చౌహాన్ ఈ కీలక ప్రకటన చేశారు. సీఎం ఈ నిర్ణయంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Tags:    

Similar News