Republic Day Celebrations : ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Update: 2024-01-26 06:07 GMT

భారత గణతంత్ర వేడుకలు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్‌ డే సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మొట్టమొదటిసారిగా భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ 100 మంది మహిళ కళాకారులు కవాతు చేశారు. ఈ వేడుకలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. దాదాపు 40ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు.

కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ఆ తర్వాత పరేడ్‌, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు.ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘75వ గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సందర్భంలో శుభాకాంక్షలు. జై హింద్!’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ఇక ఇమాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.‘‘నా ప్రియ నేస్తం నరేంద్ర మోదీ, భారతీయ ప్రజలకు మీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ వద్దే ఉన్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. వేడుకలు జరుపుకుందాం!’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.



Tags:    

Similar News