VIRAL News : ఈమెయిల్ చూడకపోవడంతో మూడేళ్లు జైల్లో..

Update: 2023-09-27 12:59 GMT

జైలు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ ఖైదీ మూడేళ్లు అనవసరంగా జైల్లో మగ్గాడు. ఖైదీకి బెయిల్ ఇవ్వాలంటూ కోర్టు పంపిన ఈమెయిల్‌ను జైలర్ చూడకపోవడమే దీనికి కారణం. ఖైదీ గోడు విన్న గుజరాత్ హైకోర్టు జైలు అధికారికి రూ. లక్ష జరిమానా విధించింది.

చందన్జీ ఠాకూర్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ హత్య కేసులో జీవిత ఖైదు పడింది. హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ 2020లో బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రీ జైలు అధికారులకు ఈమెయిల్ ద్వారా పంపింది. బెయిల్ వివరాలను మెయిల్‌కు అటాచ్ చేసింది. అయితే ఈమెయిల్‌ను జైలు అధికారులు చూడకపోవడంతో ఠాకూర్ జైల్లోనే మగ్గాడు. ఈమెయిల్‌ను జిల్లా సెషన్స్ కోర్టుకు కూడా పంపారు. ఆ కోర్టు కూడా దోషిని బెయిల్‌పై విడుదల చేయడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఠాకూర్ బెయిల్ కోసం మళ్లీ పిటిషన్ వేయడంతో అసలు సంగతి బయటపడింది. జైలు అధికారులపై హైకోర్టులో పిటిషన్ వేశాడు. కోవిడ్ 19 సంక్షోభం వల్ల తాము సకాలంలో మెయిల్ చూడలేకపోయామని అధికారులు వాదించారు. బెయిల్ ఆర్డర్ అటాచ్‌మెంట్‌లో ఉండడంతో పొరపాటున చూడలేదని చెప్పుకొచ్చారు. హైకోర్టు ఆ వాదనలను తోసిపుచ్చింది. తీవ్రమైన లోపల వల్ల ఖైదీ మూడేళ్లు జైల్లో మగ్గాడని, పరిహారంగా అతనికి 14 రోజుల్లోగా రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News