Maharas Dwarka: 37 వేల మంది మహిళల 'మహా' నృత్యం
ఒకేచోట 37 వేల మంది మహిళలు అద్భుతమైన నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. ఆ కార్యక్రమానికి వచ్చిన ఆహుతులంతా జరుగుతున్న వేడుకలను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. గుజరాత్లోని ద్వారకాలో ఈ మహా నృత్యం ఆవిష్కృతమైంది. అఖిల భారతీయ అహిరణి మహారాస్ సంఘటన్ ఆధ్వర్యంలో.. ఏసీసీ సిమెంట్ కంపెనీ క్యాంపస్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలంతా.. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీకృష్ణుడి చిత్రం చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ డ్యాన్సులు చేశారు. ద్వారకాలో జరిగిన ఈ సంప్రదాయ వేడుక పేరు మహా రాస్. అహిర్ వర్గానికి చెందిన 37 వేల మంది మహిళలు ఈ వేడుకలో పాల్గొన్నారు. సౌరాష్ట్రలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి అహిర్ వర్గీయులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
#WATCH | Gujarat: 37000 women from the Ahir community performed Maha Raas in Dwarka pic.twitter.com/Ta19lRhhiR
— ANI (@ANI) December 24, 2023
రాక్షస రాజు బనాసుర కుమార్తె ఉషకు గుర్తుగా అహిర్ ప్రజలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి మనవడు అనిరుద్ధ భార్యే ఈ ఉష. అనిరుద్ధతో ఉష ప్రేమలో పడటం, వారి వివాహానికి సంబంధించిన కథలు భాగవత పురాణంలో ఉన్నాయి.