Elections 2024: బీజేపీలో చేరేందుకు సిద్ధమైన హరీష్, సిద్ధూ

బీజేపీలోకి హరీష్, సిద్ధూ;

By :  Kiran
Update: 2024-02-19 03:36 GMT



కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. అతి త్వరలోనే బీజేపీలో చేరవచ్చనే వార్తలు జాతీయ మీడియా ఛానెళ్లలో వస్తున్నాయి. సిద్దూతో పాటుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా వచ్చే వారంలోగా కాషాయం గూటికి చేరవచ్చనేది ఆ వార్తల సారాంశం. పార్టీతో కాకుండా, పార్టీ అనుమతి లేకుండా.. వ్యక్తిగత ర్యాలీలు చేస్తూ, సొంతంగా సమావేశాలు నిర్వహిస్తూ.. పార్టీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఇప్పటికే ఆ పార్టీ సీనియర్లు కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే వేటు వేయొచ్చని, ఆ వెంటనే బీజేపీలో జాయిన్ అవుతారని కొన్ని కథనాలు అటు సోషల్ మీడియాలోనూ, ఇటు నేషనల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

అశోక్ చవాన్, మిలింద్ దేవరా మరియు సి రఘునాథ్‌తో సహా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు బిజెపిలోకి వెళ్ళిన కొద్ది రోజులకే నవజ్యోత్ సింగ్ సిద్ధూ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మరియు ఆయన కుమారుడు - చింద్వారా ఎంపి నకుల్ నాథ్ కూడా బీజేపీలో చేరబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే మరో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సైతం కాంగ్రెస్ ని వీడి కాషాయం గూటికి చేరబోతున్నారనే వార్త పోలిటికల్ గా సర్కిల్ అవుతోంది.

ఆయన మరెవరో కాదు.. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా, ఐదుసార్లు ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత హరీష్ రావత్ త్వరలోనే బీజేపీ గూటికి చేరబోతున్నారని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ లీడర్ పుష్కర్ సింగ్ ధామి.. రావత్ నివాసానికి వచ్చినప్పుడు ఈ విషయం గురించి చర్చించినట్లుగా టాక్. బీజేపీ వర్గాలు కూడా రావత్ తో పార్టీ చేరికపై మంతనాలు జరిపారని, లోక్‌సభ ఎన్నికల ముందు మంచి సమయం చూసుకొని బీజేపీలో చేరడమే తరువాయి అన్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడాయి. అయితే ఆ రూమర్స్ ని హరీష్ రావత్ ఖండించారు. తన జీవితంలో కాంగ్రెస్ ని వదిలి మరో పార్టీలో చేరే ప్రసక్తే లేదని గట్టిగా నొక్కి చెప్పారు.


Tags:    

Similar News