Manohar Lal Khattar : హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మద్యాహ్నం 1 గంటకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ, బీజేపీ కూటమిలో ఇబ్బందులు రావడంతో ఖట్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీలో సంపూర్ణ మెజారీతో బీజేపీ సొంతంగా ప్రభుత్వన్ని ఏర్పాటు చేయనుంది. ఖట్టర్ లోక్ సభ పోటీ చేసే అవకాశం ఉంది.తాజా పరిణామంతో బీజేపీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటకు 46 సీట్లు అవసరం.
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి మెజారిటీ తక్కువ రావడంతో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.తాజా పరిణామంతో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సొతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.రాష్ట్రంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సీటు షేరింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విఫలమైన కారణంగా, బీజేపీ మరియు ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా నేతత్వంలోని జెజెపి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే నివేదికల మధ్య ఊహాగానాలు తలెత్తాయి.