Haryana Government : చెట్లకు పెన్షన్‌ ఇస్తోన్న ప్రభుత్వం..ఎక్కడంటే

Byline :  Shabarish
Update: 2024-02-23 11:20 GMT

దేశవ్యాప్తంగా పేద ప్రజలకు సాయం చేసేందుకు ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వంటి పలు రకాల పెన్షన్ సేవలను కూడా అందిస్తూ వస్తున్నాయి. అయితే మనుషులకు మాత్రమే పెన్షన్ ఇస్తూ వస్తున్నాయి. చెట్లకు పెన్షన్ ఇవ్వడం ఇప్పటి వరకూ ఎప్పుడూ చూసి ఉండరు. కానీ చెట్లకు కూడా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఒకటి ఉంది. అదే హర్యానా రాష్ట్రం. హర్యానా ప్రభుత్వం ప్రాణ వాయు దేవతా యోజన కింద చెట్లకు కూడా పెన్షన్ ఇవ్వడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది.




 


ప్రాణ వాయు దేవతా యోజన కింద హర్యానా ప్రభుత్వం కొన్ని చెట్లకు పింఛను ఇస్తూ వస్తోంది. పురాతన చెట్లను సంరక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని హర్యానా ప్రభుత్వం చేపడుతోంది. ఈ స్కీమ్ కింద పురాతన చెట్లకు అంటే 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్లకు పెన్షన్ ఇస్తోంది. అందులో రావి, మర్రి వంటి పురాతన చెట్లు ఉన్నాయి. ఈ పథకం కింద భూమి లేని రైతులను ఎన్నుకుని వారి ఆదాయాన్ని పెంచేందుకు ఈ ప్రాజెక్ట్‌ను సర్కార్ ప్రవేశపెట్టింది.




 


చెట్లకు సంరక్షించే చెట్లకు ఏడాదికి రూ.2500 పింఛను ఇవ్వనుంది. దీనివల్ల అక్కడి రైతులకు కూడా చాలా మేలు జరుగుతోంది. గతంలో ప్రజలు చాలా వరకూ చెట్లను నరికేసేవారు. ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీమ్ వల్ల ఇప్పుడు చెట్లను నరికేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో చెట్లను సంరక్షించే గ్రామంలో కచ్చవా, గోలి గ్రామాలు ముందంజలో ఉన్నాయి. ఈ పథకం వల్ల ఆక్సిజన్ నాణ్యత కూడా పెరుగుతోందంటూ పర్యావరణ ప్రేమికులు హర్యానా ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Tags:    

Similar News