ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు.. బార్లు, రెస్టారెంట్లకు 24 గంటలు పర్మిషన్

Update: 2023-07-07 04:34 GMT

లేట్ నైట్ క్రేవింగ్స్ కు, మందు బాబులకు గుడ్ న్యూస్. మందు బాబులకు కిక్కిచ్చే వార్త చెప్పింది హర్యానా గవర్నమెంట్. నైట్ డ్యూటీ చేసే ఉద్యోగులు వేడి ఆహారంతో పాటు, లిక్కర్ కూడా కోరుకుంటారు. వాళ్ల అవసరాలు తీర్చేందుకు 24 గంటలు రెస్టారెంట్లు , బార్లు తెరిచి ఉంచుతున్నట్లు హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తెలిపారు. అయితే, 24 గంటలు బార్లు, రెస్టారెంట్లు నడుపుకునే వాళ్లు ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తో పాటు, కొంత ట్యాక్స్ చెల్లించాలని సూచించారు. ట్యాక్స్ చెల్లించిన వాళ్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. 24 పర్మిషన్ ఇచ్చినా.. సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడమని తెలియజేశారు. ఈ నిర్ణయం ద్వారా నైట్ షిఫ్ట్స్ లో పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనం ఉంటుందని వివరించారు. ఎప్పుడో ప్యాక్ చేసిన ఫుడ్ తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం కంటే.. వేడి వేడిగా రెస్టారెంట్స్ లో తినడం మంచిదని.. వాళ్ల ఆరోగ్య రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  




 



 



Tags:    

Similar News