సుప్రీం కోర్ట్లో పిటిషన్.. ఆర్టికల్ 370 రద్దుపై విచారణ

Update: 2023-07-11 06:32 GMT

కేంద్ర ప్రభుత్వం జమ్మూ- కశ్మీర్‌ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. మంగళవారం (జులై 11) పరిశీలించింది. ఆగస్టు 2 నుంచి పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. 2019 ఆగస్టు 5న జమ్మూ-కశ్యీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ చర్య కారణంగా అక్కడ ఎప్పుడూ లేనంతగా సుస్థిరత నెలకొందని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం (జులై 10) అఫిడవిట్ దాఖలు చేసింది. 






 


Tags:    

Similar News