Gold Price Todady : బంగారం ధరలో భారీ పతనం.. కొనండమ్మా కొనండి..
బంగారం ధర భారీగా పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడంతో గురువారం కూడా పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ మార్కెట్ల్ 22 కేరట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 600 తగ్గి రూ. 53,900కు పడిపోయింది. 24 కేరట్ల మేలిమి బంగారం ధర రూ. 650 తగ్గి రూ. 58,800కు చేరుకుంది.
మరోపక్క వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి. కేజీ రూ. 77,000 నుంచి రూ. 500 తగ్గి రూ. 76,500లకు చేరుకుంది. డాలర్ సూచీ బలం పుంజుకోవడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో పసిడిపై నష్టాలు వస్తున్నాయి. నెలల వ్యవధిలో బంగారం రేట్లు కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్ల మరింత పెంచే యోచనలో ఉండడంతో మదుపర్ల బంగారానికి బదులు షేర్లపై మొగ్గుచూపుతున్నారు. త్వరలో పసిడి, వెండి ధరలు మరింత తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మన దేశంలో పెళ్లిళ్ల సీజన్, పండగలు ముగియడంతో ప్రజలు కొనుగోళ్లకు ఆసక్తి చూడపడం లేదు. దసరా, దీపావళి సీజన్ వరకు వేచి చూస్తారని, అప్పుడు కొనుగోళ్లు పుంజుకునే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.