Tamilnadu Rains : తమిళనాడును ముంచెత్తిన వర్షం.. స్కూళ్లు బంద్

Byline :  Krishna
Update: 2024-01-08 05:54 GMT

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి చెన్నై అస్తవ్యస్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి. కడలూరు, కోయంబత్తూరు,కాంచీపురం, తంజావూరు, వెల్లూరు సహా పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

నుంగంబాక్కంలో ఆదివారం సాయంత్రం రికార్డు స్థాయిలో 17.3 మీ.మీ వర్షపాతం నమోదైంది. నాగపట్టణం, కిల్వేలూర్‌, కుడ్డలూర్‌, విల్లుపురం, కళ్లకురిచి, రాణిపేట్‌, వెల్లోర్‌, తిరువణ్ణామలైలో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. 10 జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్టణం, తిరువూర్ జిల్లాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags:    

Similar News