నూతన రాజకీయ పార్టీని స్థాపించిన హీరో విజయ్

Update: 2024-02-02 09:46 GMT

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తమిళగ వెట్రి కళగం (TVK) పేరుతో నూతన పార్టీని స్థాపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని.. అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తామని అన్నారు. తమిళ సినీ రంగంలో రజనీకాంత్

(Rajinikanth) తర్వాత అంతటి ఇమేజ్ ఉన్న నటుడు విజయ్. ఇప్పటి వరకు 68 సినిమాల్లో నటించారు. విజయ్ రాజకీయ పార్టీని పెడతాడనే చర్చ గత దశాబ్ద కాలంగా జరుగుతోంది. పలు సామాజిక సేవా కార్యక్రమాలను విజయ్ తన ఛారిటీ ద్వారా చేపడుతున్నారు. అలాగే సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు తెలిపారు. తమిళ ఇండస్ట్రీ(Tamil Industry)లో నటనతో పాటు సేవా కార్యక్రమాలతో విజయ్ అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.

ఈ మధ్యే వరద బాధితులను స్వయంగా ఆయనే నిత్యవసరాలు అందించారు. విజయ్‌కి చెందిన మక్కల్‌ ఇయ్యక్కం (Makkal Iyyakkam) అభిమాన సంఘాన్నే రాజకీయ పార్టీగా మార్చినట్లు తెలుస్తోంది. దీనికి గుర్తింపు లభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పేరు, విధానం, సిద్ధాంతం తదితర అంశాలపై చర్చించేందుకు సీనియర్ నేతలతో విజయ్ సమావేశాలు నిర్వహించారు.ఇందులో సదరు రాజకీయ పార్టీకి విజయ్‌‌ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha elections) ఆయన పార్టీ బరిలోదిగే అవకాశం ఉంది.దళపతికి ఈస్థాయి స్టార్‌డమ్‌ రావడం వెనక తెలుగు మూవీల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. ఆయన సినీ కెరీర్‌లో ‘పోక్కిరి’, ‘గిల్లి’, ‘బద్రి’, ‘ఆది’, ‘వేలాయుధం’, ‘యూత్‌’ వంటి సినిమాలు ముఖ్యమైనవి. కెరీర్‌ను మలుపుతిప్పాయి కూడా. ఇవన్నీ టాలీవుడ్ (Tollywood) సినిమాలే కావడం విశేషం. అభిమానులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏడాదిలో రెండుసార్లు నేరుగా సమావేశమై వారికి విందు, బహుమతులు అందిస్తారు.




Tags:    

Similar News