ప్రైవేటు కంసెనీల్లో రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు
ప్రైవేటు రంగంలో భారీ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించడానికి హరియాణా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పంజాబ్-హరియాణా హైకోర్టు రద్దు చేసింది. స్థానికులకు 75 శాతం కోటా కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దేశపౌరులందరూ సమానమేనన్న రాజ్యాంగ స్ఫూర్తిని ఈ చట్టం దెబ్బతీస్తోందని, ప్రైవేటు కంపెనీలను ఇలా నియంత్రించం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ఈ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14వ, 19వ అధికరణలను ఉల్లంఘించింది. ఇతర రాష్ట్రాల్లోని భారతీయులను వలసవచ్చిన వారిగా, రెండో తరగతి పౌరుగా ఈ చట్టం భావిస్తోంది. వారికి జీవనోపాధి హక్కును నిరాకరిస్తోంది’’ అని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
మనోహర్ లాల్ ఖట్టర్ సారథ్యంలేని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2020లో చట్టం తీసుకొచ్చిందది. దీని ప్రకారం.. నెలకు రూ.30 వేలం జీతానికిన్నా తక్కువ వచ్చే ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా కల్పించాలి. ఇది తమకు ఇబ్బందికరమని, కోటాలను అమలు చేస్తే నష్టపోవాల్సి వస్తుందని కంపెనీలు హైకోర్టు ఆశ్రయించారు. కోర్టు ఆ చట్టం చెల్లదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఖట్టర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్టే విధించిన సుప్రీం కోర్టు తుది నిర్ణయాన్ని హైకోర్టుకే వదిలేసింది.