సినిమాను తలపించిన ప్రేమ పెళ్ళి.. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు

Byline :  saichand
Update: 2024-01-04 08:06 GMT

కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఓ ప్రేమ జంట పెళ్ళి చేసుకున్న తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కారు వెనుకలా కూర్చోని ఆడియోలో వచ్చే వేద మంత్రాల సాక్షిగా దండలు మార్చుకుని ఈ ప్రేమ జంట వివాహం చేసుకుంది. .

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బళ్ళారి జిల్లాలోని తెక్కలికోటకు చెందిన శివప్రసాద్.. కొప్పళ జిల్లాలకు చెందిన అమృత అనే యువతిని ప్రేమించాడు. అతని ప్రేమను ఆ అమ్మాయిని కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలి నిర్ణయించుకున్నారు.

అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి వివాహాన్ని ఒప్పుకోలేదు. దీంతో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ జంట కారులో వివాహం చేసుకున్నారు. అనంతరం తెక్కలకోటె పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారి తల్లిదండ్రులను పిలిపించి వారి ప్రేమను ఒప్పుకోవాలని సూచించారు. తర్వాత యువతి అభిప్రాయం అడగ్గా.. మెుదటిగా భర్త శివప్రసాద్ ఉంటానని చెప్పిన అమృత తర్వాత మాట మార్చి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతానని చెప్పడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతు అయింది.

దీంతో ఏం చేయాలో తెలియక కంటోన్మెంట్‌లోని స్త్రీ సేవా నికేతన్‌ సంరక్షణ కేంద్రానికి ఆ యువతిని తరలించారు.

తర్వాత పెద్దల మాట్లాడి యువతి అభిప్రాయాన్ని తెలుసుకోని ఆమె ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తామని పోలీసులు తెలిపారు.

మరుసటి రోజు అమృత తల్లిదండ్రులు, శివప్రసాద్‌ తల్లిదండ్రుల మధ్య పోలీసులు పంచాయితీ చేయగా.. యువతి ప్రసాద్‌తోనే ఉంటానని చెప్పడంతో అమృతను అతని వెంటనే పంపారు. ఆద్యంతం సాగిన ఈ కథ చివరికి సుఖాంతమైంది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News