బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్సైంది. ఈనెల 17న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. అదే రోజు బీజేపీ మేనిఫెస్టోను అమిత్ షా విడుదల చేస్తారు. సోమాజీగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 17న అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 4 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహించారు. మరోవైపు నవంబర్ చివరి వారంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు ఎన్నికల ప్రచారానికి రానున్నారు.