వర్షం బీభత్సం.. పేక మేడల్లా కూలిన ఇళ్లు.. వీడియోలో ఘోరంగా

By :  Lenin
Update: 2023-08-15 16:34 GMT

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరద ప్రలయాలతో పెను విషాదం నింపుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలవల్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దాంతో ఇళ్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి. సిమ్లాలోని కృష్ణా నగర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో 5 నుంచి 7 ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయారా అని సహాయక బృందాలు వెతుకుతున్నాయి.

సెకన్ల వ్యవధిలో ఇళ్లు కూలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొండ చరియలు విరిగిపోయి, ఇళ్లు కొట్టుకుపోయిన ఘటనలో మృతుల సంఖ్య 55కు చేరినట్లు తెలుస్తోంది. వరదల్లో గల్లంతైన వారికోసం కేంద్ర, రాష్ట్ర విపత్తు దళాలు గాలిస్తున్నాయి. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. 11 జిల్లాల్లో 857 రోడ్లు బ్లాక్ అయ్యాయి. 4,285 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 889 చోట్ల నీటి సరఫరా నిలిచిపోయింది. రూ. 7,171 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

Tags:    

Similar News