Rahul Gandhi:కుక్కకి బిస్కట్లు తినిపించడంలో బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటి..

Byline :  Veerendra Prasad
Update: 2024-02-06 14:09 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. అయితే ఆ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఒక కుక్కపిల్లకు బిస్కట్లు తినిపిస్తున్న వీడియో పెద్ద దుమారం రేపుతోంది. ఈ వీడియోను బీజేపీ షేర్ చేస్తూ, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. దీనిపై రాహుల్ గాంధీ.. కుక్కలపై కూడా బీజేపీకి ఇంత కోపమా? అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..

భారత్ జోడ్ యాత్రలో రాహుల్ గాంధీ వద్దకు ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకువచ్చాడు. ఆ కుక్కకు రాహుల్ గాంధీ బిస్కెట్ తినిపించే ప్రయత్నం చేయగా, అది నిరాకరించింది. అయితే, రాహుల్ గాంధీ ఆ బిస్కెట్‌ను కుక్క యజమానికి ఇచ్చాడు. దీంతో రాహుల్‌ను బీజేపీ టార్గెట్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. రాహుల్ తన మద్దతుదారులను కుక్కల్లా చూస్తున్నారంటూ ఆక్షేపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో రాహుల్‌ను మీడియో ప్రశ్నించింది. కార్యకర్తకు కుక్క బిస్లెట్లు ఇచ్చారా అంటూ రాహుల్‌ను మీడియా ప్రశ్నించడంతో ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు.

కుక్క నిరాకరించడంతో దాని యజమానికి ఆ బిస్కెట్ అందించాను, అది తప్పా అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. కుక్కను తన చేతుల్లోకి తీసుకున్న సమయంలో అది భయపడిందని, బిస్కెట్ తినేందుకు నిరాకరించింది. వెంటనే దాని యజమానిని పిలిచి, కుక్కతో పాటు బిస్కెట్ ఇచ్చానని చెప్పారు. అతను ఇచ్చిన తర్వాత కుక్క బిస్కెట్ తిన్నదని, ఇందులో బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ''బీజేపీకి కుక్కలు ఏమి హాని చేశాయి? ఇదేనా వారికి కుక్కపిల్లలపై ఉన్న ప్రేమ'' అంటూ రాహుల్ నిలదీశారు.

Tags:    

Similar News