Paytm ఫాస్ట్ట్యాగ్ మార్చుకోవాలా వద్దా? RBI సూచనలు ఇవే!

Byline :  Bharath
Update: 2024-02-19 10:45 GMT

NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) తరఫున టోల్‌ వసూలు చేసే జాబితా నుంచి.. ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ను తొలగించింది. అయితే మార్చి 15 తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించాలంటే మాత్రం.. ఆర్బీఐ సూచించిన బ్యాంకుల నుంచే మాత్రమే ఫాస్ట్ ట్యాగ్‌లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ జాబితాలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యెస్‌ బ్యాంక్‌ సహా మొత్తం 32 బ్యాంకులున్నాయి.

అయితే ఇప్పుడు పేటీఎం ఫాస్ట్ట్యాగ్ కస్టమర్లు తమ అకౌంట్ లోని బ్యాలెన్స్ ను ఇతర బ్యాంకులకు ట్రాన్స్ ఫర్ చేసుకునే వీలు లేదు కాబట్టి.. మార్చి 15 లోపు మొత్తం అమౌంట్ ను వాడుకోవాలి. ఆ తర్వాత ఫాస్ట్ట్యాగ్ పేటీఎం నుంచి టోల్ ఫీజులు చెల్లించడానికి వీల్లేదు. మార్చి 15 లోపు ఫాస్ట్ట్యాగ్ అకౌంట్ ను వేరు బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్బీఐ తెలిపింది. చాలామందికి పేటీఎం ఫాస్ట్ టాగ్ అంకౌంట్ ఉంది. అలా ఉన్నవాళ్లు దాన్ని వేరే బ్యాంక్ కు మార్చుకోవచ్చు. లేదా డియాక్టివేట్ చేసుకోవచ్చు.

Paytm ఫాస్ట్‌ట్యాగ్‌ని ఎలా డీయాక్టివేట్ చేయాలి..?

యూజర్ ఐడీ లేదా వాలెట్ ఐడీ, పాస్‌వర్డ్ తో FASTag Paytm పోర్టల్‌ లోకి లాగిన్ అవ్వాలి.

తర్వాత ఫాస్ట్ టాగ్ రిజిస్ట్రేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ తో వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

పోర్టల్‌లోని సర్వీస్ రిక్వెస్ట్ లోకి వెళ్లి. ది ఫాస్ట్‌ ట్యాగ్ కేటగిరీని ఎంచుకోవాలి.

పేజ్ చివరన కనిపించే హెల్ప్ & సపోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

అక్కడ కనిపించే ఫాస్ట్ టాగ్ డియాక్టివేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

తర్వాత మీ ఎందుకు అకౌంట్ డిలీట్ చేయాలకుంటున్నారో రీజన్ అడుగుతుంది. ఆ ఆప్షన్ ఎంచుకోవాలి.

మీ రిక్వెస్ట్ పై ఓ రిఫరెన్స్ నెంబర్ క్రియేట్ అవుతుంది. దాన్ని మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా పూర్తైన తర్వాత ఫాస్ట్ టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది.

ఒకసారి మీ ఫాస్ట్ టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అయితే మళ్లీ ఆ అకౌంట్ పొందలేరు.

Tags:    

Similar News