Pakistan Parliament Elections : పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల్లో హంగ్

Update: 2024-02-10 05:01 GMT

పాకిస్థాన్ పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 133 మంది ఎంపీలు కాగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాజీ ప్రధాని నవాజ్ షరీప్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమతో కలిసి రావాలని చిన్న పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు. నవాజ్ షరీప్ పార్టీ పాకిస్థాన్ ముస్లీం లీగ్-నవాజ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. తాజాగా పాక్ ఎన్నికల సంఘం మొత్తం 265 నియోజకవర్గాలకు గాను 241 స్థానాల ఫలితాలను విడుదల చేసింది. ఇందులో తోషఖానా, సైఫర్‌ సహా మరో కేసులో శిక్ష పడి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతున్న అభ్యర్థులు విజృంభించారు. ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తయిన 226 స్థానాల్లో 97 చోట్ల జయభేరి మోగించారు.




 


నవాజ్ షరీఫ్ పార్టీ PML-N 72, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 52, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ 15 ఇతర పార్టీలు 8 సీట్లు గెలుచుకున్నాయి. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా, ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మహిళలు, మైనారిటీలకు కేటాయిస్తారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడం వల్ల 265 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు కావాలి.జాతీయ అసెంబ్లీలో అత్యధిక సీట్లను ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో స్థానంలో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)- పీఎంఎల్‌(ఎన్‌) నిలిచే అవకాశం ఉంది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏఐ ఆధారిత విక్టరీ స్పీచ్ విడుదల చేశారు. నా ప్రియమైన దేశ ప్రజాలారా ఇంత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నారని..ఈ ఎన్నికల్లో అద్బుతమైన విజయం సాధించేందుకు సహాయం చేసినందుకు ధన్యవాదలు అని ఇమ్రాన్ పేర్కొన్నారు.


 


Tags:    

Similar News