ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బలి తీసుకున్న నలుగురిలో హైదరాబాదీ

Update: 2023-08-01 14:48 GMT

జైపూర్ - ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన నలుగురిలో ఒకరు హైదరాబాదీ ఉన్నారు. మృతుడు సయ్యద్ సైఫుద్దీన్ హైదరాబాద్లోని ఏసీ గార్డ్స్ ప్రాంతానికి చెందినవాడని తేలింది. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సైఫుద్దీన్ కు ఆరు నెలల క్రితమే మూడో కూతురు పుట్టింది. మృతిని కుటుంబసభ్యులను స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ పరామర్శించి ధైర్యం చెప్పారు.

జులై 31 సోమవారం ఉదయం 6గంటల సమయంలో చేతన్ సింగ్ అనే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ జైపూర్ - ముంబై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో దారుణానికి తెగబడ్డాడు. తన రైఫిల్ తో నలుగురిని కాల్చి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. చేతన్ సింగ్ కాల్పులు జరిపిన నలుగురు వ్యక్తులు ముస్లింలని, విద్వేషంతోనే అతను వారిపై కాల్పులు జరిపినట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. ఘటనకు ముందు చైతన్ సింగ్ చేతిలో ఆటోమేటిక్ రైఫిల్ పట్టుకుని ఒకవేళ భారత్ లో ఉంటాలంటే ప్రధాని నరేంద్రమోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు మాత్రమే ఓటేయాలని వార్నింగ్ ఇచ్చిన విషయం రికార్డైంది.

Tags:    

Similar News