అయోధ్య రామ మందిరంపై ఆర్మీ హెలికాప్టర్లతో పూలవర్షం

Byline :  Krishna
Update: 2024-01-22 07:49 GMT

హిందువుల 500 ఏళ్ల కల సాకారమైంది. అయోధ్య రామమందిరంలో బాల రాముడు కొలువుదీరాడు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అభిజిత్ లగ్న ముహూర్తంలో 12.29 నిమిషాలకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ క్రతువు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొన్నారు. రాముని ప్రాణ ప్రతిష్ఠతో దేశం మొత్తం నామ స్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా అయోధ్య రామమందిరంపై పూల వర్షం కురిసింది. ఆర్మీ హెలీ కాఫ్టర్లతో రామ మందిరంపై పూల వాన కురిపించారు. అద్భుత దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.

Tags:    

Similar News