Kalpana Soren : జైల్లో హేమంత్ సోరెన్.. పెళ్లి రోజు భార్య ఎమోషనల్

Byline :  Krishna
Update: 2024-02-07 08:44 GMT

(Kalpana Soren) మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గత వారం రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇవాళ హేమంత్ సోరెన్ - కల్పన సోరెన్ దంపతుల పెళ్లి రోజు. ఈ నేపథ్యంలో కల్పన ఆయన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఇవాళ మా పెళ్లి రోజు. కానీ ఆయన మాతో లేరు. కుట్రలను చేధించి విజేతగా నిలిచి త్వరలోనే ఆయన మమ్మల్ని కలుసుకుంటారని నమ్ముతున్నాను. హేమంత్ తలవంచడానికి అంగీకరించలేదు.. అందుకే ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది’’ అని ట్వీట్ చేశారు.

అంతేకాకుండా హేమంత్ లాగే తాను కూడా క్లిష్ట పరిస్థితుల్లో చిరునవ్వుతోనే ఉంటానని చెప్పారు. ‘‘నేను జార్ఖండ్ యోధుడికి జీవిత భాగస్వామిని. ఇవాళ నేను ఎమోషనల్ అవ్వను. అతను చేసే పోరాటానికి బలంగా మారుతాను’’ అని కల్పన సోరెన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు వారు కలిసి దిగిన ఫొటోను జత చేశారు. మరోవైపు ఈడీ అరెస్ట్ను జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈడీ నిబంధనలు ఉల్లంఘించి తనను అరెస్ట్ చేసిందని పిటిషన్ దాఖలు చేశారు. సోరెన్ పిటిషన్పై ఈ నెల 12న హైకోర్టు విచారణ జరపనుంది. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది.




 


కాగా రూ.600కోట్ల భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. భారత సైన్యం ఆధీనంలో ఉన్న భూమిని సోరెన్ అక్రమంగా విక్రయించి లబ్దిపొందారని ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో పలుసార్లు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. ఆయన ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో జనవరి 31న ఆయన్ను 7గంటల పాటు విచారించిన ఈడీ ఆ తర్వాత అరెస్ట్ చేసింది. 




 



Tags:    

Similar News