బ్యాంక్ జాబ్స్ కోసం ఎదరుచూసేవారికి గుడ్ న్యూస్

Update: 2023-07-02 08:29 GMT

బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఐబీపీఎస్ గుడ్​ న్యూస్​. 4,045 క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్తో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ సహా పలు బ్యాంకుల‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. 2023 సంవత్సరానికి గానూ కామన్​ రిక్రూట్​మెంట్ ప్రక్రియ ద్వారా ఈ నియామకాలను చేపడుతోంది.

ఈ పోస్టులకు డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు. అర్హులైనవారు జులై 1 నుంచి జులై 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగష్టు లేదా సెప్టెంబర్​ల్లో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష 2023 అక్టోబర్​లో జరుగుతుంది.




 


వ‌య‌సు: 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది ప్రిలిమ్స్‌ 100 మార్కులకు, రెండోది మెయిన్స్‌ 200 మార్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ibps.in/




 




 


Tags:    

Similar News