IBPS PO 2023 Notification: ఐబీపీఎస్‌లో 3,049 ఉద్యోగాలు.. డిగ్రీ పాసయితే చాలు
బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) ఈ నెల(ఆగష్టు) 1 న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (CRP PO/ MT XIII), స్పెషలిస్ట్ ఆఫీసర్ (CRP SPL XIII) నియామక పరీక్షల ద్వారా 3,049 ప్రొబెషెనరీ ఆఫీసర్లు/ మేనేజ్మెంట్ ట్రెయినీలు, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఆగష్టు 1న ప్రారంభమవగా.. ఆగస్ట్ 21న ముగుస్తుంది. IBPS POకి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://ibps.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. IBPS PO ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్‌లో, మెయిన్స్ పరీక్ష నవంబర్ 2023లో జరగనుంది. ఇంటర్వ్యూ జనవరి/ ఫిబ్రవరి 2024లో నిర్వహిస్తారు.
IBPS PO/MT ఖాళీల వివరాలు:
పోస్ట్ పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్మెంట్ ట్రైనీస్ (MT)
పోస్టుల సంఖ్య: 3,049
కేటగిరీ వారీగా పోస్టులు
ఎస్సీ – 462
ఎస్టీ – 234
ఓబీసీ – 829
ఈడబ్ల్యూఎస్ – 300
యూఆర్(UR) – 1,224
విద్యా అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం(Recognized university) నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు: అభ్యర్థి తప్పనిసరిగా ఆగష్టు 2, 1993 తర్వాత పుట్టి ఉండాలి.. ఆగష్టు 1, 2003 తర్వాత పుట్టిన వాళ్లు అనర్హులు. అంటే ఏజ్ లిమిట్ 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.
రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, డేటా అనాలసిస్, ఇంటర్‌ప్రిటేషన్ విభాగాల నుంచి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. లెటర్ రైటింగ్, ఎస్సే ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో మాత్రమే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
ఇలా అప్లై చేయండి:
స్టెప్ 1 – Official Website ibps.in సైట్‌కి వెళ్లండి
స్టెప్ 2 – హోమ్‌పేజీలో(Home Page) రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 3 – ఫారమ్‌ను పూరించండి
స్టెప్ 4 – ఫీజు చెల్లించండి
స్టెప్ 5 – కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోని ఉంచుకోండి
ఫీజ్: SC, ST, PwBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 175. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 850.
అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
IBPS SO 2023 ఖాళీల వివరాలు:
అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-I): 500
HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I): 31
ఐటీ అధికారి(స్కేల్-I): 120
లా ఆఫీసర్ (స్కేల్-I): 10
మార్కెటింగ్ అధికారి (స్కేల్-I): 700
మార్కెటింగ్ అధికారి (స్కేల్-I): 41
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది ఆగస్టు 21, 2023. ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 2023లో ఉంటుంది. మెయిన్ పరీక్ష జనవరి 2024లో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరి/ మార్చి 2024లో ఉంటుంది.