ICMR survey: పల్లెలతో పోల్చితే.. పట్నం పిల్లలే వెనకబడుతున్నరు

Update: 2023-07-03 02:53 GMT

పట్నం పిల్లలు అన్నిట్లో ముందుంటారు. అక్కడి వాతావరణం వేరు. చురుగ్గా ఎదుగుతారు.. అనేవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు పరిస్థితి మారింది. పట్నం పిల్లలతో పోల్చితే.. పల్లె పిల్లలే మానసికంగా, శారీరకంగా ఎదగటంలో ముందున్నారని ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సర్వేలో తేలింది. ‘పిల్లల చుట్టు పక్కల ఎలాంటి వాతావరణ పరిస్థుతులు ఉంటే.. వాళ్ల భవిష్యత్తు బాగుంటుంద’ని నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.

ఈ సర్వే ప్రకారం.. 1990 సంవత్సరం ముందు దేశవ్యాప్తంగా పట్టణాల్లోని పిల్లలు, గ్రామీణ ప్రాత పిల్లలతో పోల్చితే (5-19 ఏళ్లు) ఫిజికల్ గా, మెంటల్ గా మెరుగ్గా ఉండేవాళ్లు. పిల్లల అభివృద్ధి బాగుందని.. పట్టణాలకు వలసలు పెరిగాయి. అయితే.. 1990 నుంచి 2020 మధ్య కాలంలో పట్టణాల్లో పరిస్థితులు మారాయి. దాంతో పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి దోహదపడలేదు. ఎత్తు, శారీరక బలం విషయాల్లో పట్టణాల పిల్లలతో పోల్చితే గ్రామీన ప్రాతం పిల్లలే మెరుగ్గా ఉన్నారని గుర్తించారు. 

Tags:    

Similar News