త్వరలో దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.15కే : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Update: 2023-07-06 03:43 GMT

దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులకు అందనంత ఎత్తులోకి చేరుకున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ ధరలు తగ్గించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. త్వరలో అన్ని వాహనాలు.. రైతులు తయారు చేసే ఇథనాల్ తో నడుస్తాయన్నారు కేంద్ర రవాణా, రహదారుల శాక మంత్రి నితిన్ గడ్కరీ. రాజస్థాన్ లోని ప్రతాప్ గడ్ లో నిర్వహించిప ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు. 60శాతం ఇథనాల్ ఆయిల్, 40 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తే దేశంలో రూ. 15కే పెట్రోల్ దొరుకుతుందని తెలిపారు.

రైతులు కేవలం అన్నదాతలుగానే కాకుండా.. ఇంధన దాతలుగా కూడా మారాలని గడ్కరి అన్నారు. ఇథనాలు వాహనాల వల్ల ప్రజలకు మేలు జరగడమే కాదు.. చమురు దిగుమతులు తగ్గుతాయని తెలిపారు. దానివల్ల చమురు దిగుమతులు తగ్గి రూ. 16 లక్షల కోట్ల ఆదాయం రైతులకు చేరి, గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. 




Tags:    

Similar News