Domestic violence : భర్తలపై పెరుగుతోన్న గృహహింస..చావుదెబ్బలు తినాల్సిందేనా?

Byline :  Shabarish
Update: 2024-02-26 13:46 GMT

ఒకప్పుడు భర్తనే దైవంగా పూజించే భార్యలు ఇప్పుడు చితకబాదుతున్నారు. భార్యాభర్తలన్నాక గొడవలు సహజమే అని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడంతా చిన్న చిన్న మనస్పర్ధలకే విడాకుల దాకా వెళ్తున్నారు. ఒకప్పుడు భార్యలపై గృహహింస ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు భర్తల్లో ఆ గృహహింస ఎక్కువైంది. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే..గొడవ ఎందుకులేనని భర్తలు అనుకుంటున్నాడు. కానీ భార్యలు మాత్రం అలా కాదు. గోరంత గొడవను కొండంత చేస్తున్నారని భర్తలు లబోదిబోమంటున్నారు. దీంతో భార్యల చేతుల్లో చెంప దెబ్బలు, చీపురు దెబ్బలు తినక తప్పడం లేదంటూ మరికొందరు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు.

ఇప్పుడంతా భార్యలు భర్తలను చితకబాదడం అలవాటుగా వస్తోంది. పెద్ద పెద్ద గొడవలు అవుతాయని భర్తలు మౌనంగా ఉంటే భార్యలు మాత్రం చావు దెబ్బలు తినిపిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా చూసినా భార్యలదే డామినేషన్‌గా కనిపిస్తోంది. ఇకపోతే ఇప్పుడొక షాకింగ్ విషయం తెలిపింది. భార్యల చేతుల్లో భర్తలు చావుదెబ్బలు తింటున్నది ఎక్కువగా తెలంగాణలోనేనని తేలింది. బయో సోషల్ స్టడీస్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయం తెలిసింది.

ఇకపోతే భార్యల చేతుల్లో ఎక్కువగా దెబ్బలు తింటున్నది తాగుబోతులు, నిరక్షరాస్యులేనని సర్వేలో తేలింది. దేశ వ్యాప్తంగా భర్తలపై జరుగుతున్న గృహహింసపై బయో సోషల్ స్టడీస్ రీసెర్చ్ సంస్థ అధ్యయనం చేసింది. ఆ సర్వే రిపోర్ట్‌ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ఆ అధ్యయనం ప్రకారంగా చూస్తే గత 15 ఏళ్లలో భర్తలపై దాడులు ఐదు రెట్లు పెరిగాయని తేలింది.

ప్రతి 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలను ఇష్టానుసారంగా చితకబాదుతున్నారట. 2006లో అయితే ప్రతి 1000 మంది మహిళల్లో కేవలం 7 మంది మాత్రమే తమ భర్తలపై దాడులు చేసేవారట. ఈ 15 ఏళ్ల కాలంలో భర్తలపై దాడులు మరింత పెరిగాయి. ఇకపోతే దేశంలో మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలున్నాయి. దానివల్ల పురుషులపై గృహహింస మరింత పెరుగుతోందని మగరాయుళ్లు మొరపెట్టుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో భార్యల చేతిలో చావుదెబ్బలు తినే మగవారి సంఖ్య మరింత పెరగనుందట. ఈ చేదు నిజం తెలిసినవారు పెళ్లికి దూరంగా ఉంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారట. కాబట్టి పెళ్లి చేసుకున్న, చేసుకోబోయే మగవాళ్లూ.. తస్మాత్ జాగ్రత్త. 

Tags:    

Similar News