MP Sunil Kumar Pintu: కాంగ్రెస్ వద్ద సమోసాలు తినిపించడానికి కూడా పైసల్లేవు: జేడీయూ ఎంపీ

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 04:45 GMT

కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న విపక్ష కూటమి ‘ఇండియా’ (INDIA).. నిన్న నాలుగోసారి భేటీ అయ్యింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటుపై చర్చించినట్లు అందులో పాల్గొన్న నేతలు వెల్లడించారు. అయితే, ఈ సమావేశంపై జేడీ(యూ) ఎంపీ సుశీల్‌ కుమార్‌ పింటూ విమర్శలు గుప్పించారు. అది కేవలం చాయ్‌-బిస్కెట్లకే పరిమితమైందని.. సమోసా లేకుండానే ఆ సమావేశం ముగిసిందని వ్యాఖ్యానించారు. అయితే ఇంతకముందు కూటమి సమావేశాల్లో టీ, సమోసాలు ఉండేవని, అయితే నాలుగో సమావేశంలో మాత్రం టీ, బిస్కట్లకే పరిమితమైందని అన్నారు. ముఖ్యమైన అంశాలు చర్చించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘నిన్నటి సమావేశంలో అనేక పార్టీల అగ్రనాయకులు ఇండియా కూటమి సమావేశానికి వచ్చారు. అయితే దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. నిన్నటి సమావేశం టీ బిస్కెట్లకే పరిమితమైంది. ఎందుకంటే తమకు నిధుల కొరత ఉందని, రూ. 138, రూ. 1380, లేదా 13,800 విరాళాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఇటీవల కోరింది. విరాళాలు ఇంకా రాలేదు. కాబట్టి నిన్నటి సమావేశంలో సమోసా లేకుండా కేవలం టీ, బిస్కెట్లతోనే ముగించింది. ఎటువంటి సమస్యపై ఎలాంటి చర్చ లేకుండా ముగిసింది’’ అని సునీల్ కుమార్ చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత అమిత్ మాలవీయా స్పందిస్తూ... ఇండియా కూటమి సమావేశంలో సమోసా లేకపోవడంతో నితీష్ కుమార్ ఎంపీలు నిరాశకు గురయ్యారని చెప్పారు.

Tags:    

Similar News