ఈ పోస్ట్ ఆఫీస్ను ఎలా కట్టారో చూస్తే మైండ్ బ్లాంకే.. వీడియో..
దేశంలోనే తొలి త్రీడి పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులో ఏర్పాటు చేసినన దీనిని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో కేవలం 45రోజుల్లోనే దీనిని పూర్తిచేసినట్లు మంత్రి తెలిపారు. నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను మంత్రి ట్వీట్ చేశారు. ఇది వరకు అసాధ్యం అనుకున్నది.. ఇప్పుడు సాధ్యమవుతోందని తెలిపారు.
ఈ ఆఫీసును పూర్తిగా ఇండియా టెక్నాలజీతో చేపట్టగా.. ఆత్మ నిర్భర భారత్‌కి నిదర్శనం అని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ప్రధాని చేపడుతున్న అభివృద్ధి పనులకు ఈ బిల్డింగ్ ఒక నిదర్శనమని చెప్పారు. దేశానికి కొత్తదనాన్ని పరిచయం చేయడంలో బెంగళూరు ముందు ఉంటుందన్నారు. త్రీడీ పోస్ట్ ఆఫీసు బిల్డింగ్తో దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని.. యావత్ దేశం ఇదే స్ఫూర్తితో పురోగమిస్తోందని చెప్పారు.
బెంగళూరులోని హాలాసూర్ కేంబ్రిడ్జి లే అవుట్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ త్రీడీ బిల్డింగ్ను రూపొందించారు. ఎల్ అండ్ టీ కంపెనీ.. ఐఐటీ మద్రాస్ సహకారంతో భవన నిర్మాణాన్ని పూర్తిచేసింది. కాగా రెండేళ్ల కిందట కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశ తొలి త్రీడీ ప్రింటెడ్ హౌస్‌ని ప్రారంభించారు. దాన్ని వత్స మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సంస్థ.. IIT మద్రాస్ క్యాంపస్‌లో నిర్మించింది.
The spirit of Aatmanirbhar Bharat!