ఇండియా మౌనంగా ఉండదు.. మణిపూర్ ఘటనపై రాహుల్‌

By :  Kiran
Update: 2023-07-20 06:27 GMT

మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘మోదీ మౌనం, చేతకాని తనం వల్లే మణిపుర్‌లో అరాచకాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలపై ‘ఇండియా’ మౌనంగా ఉండదు. మణిపుర్‌ ప్రజలకు మేం అండగా ఉంటాం. శాంతి మన ముందున్న ఏకైక మార్గం’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ లో ఈ ఘటన జరగం సిగ్గుచేటు. ఇలాంటి నీజమైన హింసను సహించకూడదు. మణిపూర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితిపై దృష్టి పెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నిందితులను కఠినంగా శిక్షించాలి’’ అని ట్వీట్ చేశారు.

కాగా జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళలను నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మే 4న రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొందరి కోసం గాలిస్తున్నారు.

Tags:    

Similar News