కార్గిల్‌ కొండల్లో సత్తా చాటిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌

Update: 2024-01-07 11:43 GMT

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో ఘనత సాధించింది. కార్గిల్ కొండల్లో భారత సత్తాను చాటింది. అత్యంత కఠినమైన కార్గిల్‌ పర్వతాల్లోని ఎయిర్‌స్ట్రిప్‌పై తొలిసారి సి-130జే విమానాన్ని రాత్రివేళ ల్యాండింగ్‌ చేసింది. ఈ విషయాన్ని ఎయిర్ ఫోర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. మొదటిసారిగా సి-130జే విమానం కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో రాత్రి ల్యాండింగ్ చేశాం. గరుడ్ కమాండ్స్ ట్రైనింగ్లో భాగంగా ఈ ల్యాండింగ్ చేపట్టాం. ఈ మార్గంలో టెర్రైన్ మాస్కింగ్‌ని ఉపయోగించాం’’ అని ఎయిర్ ఫోర్స్’’ ట్వీట్ చేసింది.

కార్గిల్ కొండల్లో విమానం ల్యాండింగ్కు పగటిపూట కూడా వాతావరణం అంతంతమాత్రమే అనుకూలిస్తుంది. అలాంటిది రాత్రివేళ ఒక భారీ విమానాన్ని ల్యాండింగ్ చేసిన వాయిసేన నైపుణ్యం, తెగువను మెచ్చుకోవాల్సిందే. ఇక ఎయిర్ ఫోర్స్కు సి-130జే ఎంతో నమ్మకమైన విమానం. ఇటీవల ఉత్తరాఖండ్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో ఇది కీలక పాత్ర పోషించింది. కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ ఇవి భారీ ఇంజినీరింగ్‌ పరికరాలను అక్కడికి తరలించాయి. ఎయిర్ ఫోర్స్ దగ్గర మొత్తం 12 సి-130జే విమానాలున్నాయి. బలగాలు, సామగ్రి తరలింపులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.


Tags:    

Similar News