సెల్యూట్ శునకమా..సైనికుడి కోసం ఎంత గొప్ప త్యాగం
టెర్రరిస్టుల అటాక్‌లో ఓ సైనికుడిని కాపాడే ప్రయత్నంలో భారత అర్మీ డాగ్ కెంట్ తన ప్రాణాలు కోల్పోయింది. ఆపరేషన్ సుజలిగాలలో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న టీమ్ అర్మీ డాగ్ కెంట్‌ను తమవెంట తీసుకువెళ్లింది. ఈ క్రమంలో టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య పెద్ద ఎత్తున ఫైరింగ్ జరిగింది. భీకరమైన పరిస్థితుల్లో ఒక దట్టమైన పొద దగ్గర సైనికుల కెంట్‌ను అనుసరించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను పసిగట్టిన కెంట్ వెంటనే సైనికులను అలర్ట్ చేసింది. రెండు వర్గాల మధ్య భారీగా కాల్పుల జరిగాయి. ఇదే సమయంలో ఓ భారత సైనికుడిని ఉగ్రవాదులు చుట్టుముట్టారు. దీంతో అతడిని కాపాడేందుకు కెంట్ టెర్రరిస్టులకు ఎదురుగా వెళ్లింది. కానీ భారీ కాల్పులు జరగడంతో శునకం తీవ్రంగా గాయపడి మరణించింది.
యుద్ధ భూమిలో ఆర్మీ డాగ్ కెంట్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారత సైన్యం సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించింది. " ఇది ఎంతో బాధించే వార్త. 21వ ఆర్మీ డాగ్ యూనిట్‌లోని లాబ్రడార్ జాతికి చెందిన ఫీమేల్ డాగ్ కెంట్ భారత సైనికుడిని టెర్రరిస్టుల నుంచి రక్షించే క్రమంలో ప్రాణాలను కోల్పోయింది. దేశం కోసం కెంట్ గొప్ప త్యాగం చేసింది" అని ట్విటర్ వేదికగా కెంట్కు భారత సైన్యం నివాళులు అర్పించింది.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ టెర్రరిస్టును భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ ఫైరింగ్‌లో ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు సైనికులు, ఓ పోలీస్ అధికారి గాయపడ్డారని జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేశ్ సింగ్ తెలిపారు.