ఇండియన్ ఆర్మీలో పనిచేయాలని ఆశించే ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ షార్ట్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా తాజాగా 196 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 19లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. కనుక ఆసక్తిగల అభ్యర్థులు మరో 14 రోజులలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ ఆర్మీ 62వ షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ మెన్ (ఏప్రిల్ 2024); 33వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు (ఏప్రిల్ 2024) కోసం ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు పెళ్లి కాని పురుషులు, మహిళలు సహా, మిలటరీలో సేవలందించి అమరులైనవారి భార్యలు (వితంతువులు) కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగాల వివరాలు
SSC (టెక్) - 175 పోస్టులు
SSCW (టెక్) - 19 పోస్టులు
SSCW టెక్ & నాన్ టెక్ - 02 పోస్టులు
క్వాలిఫికేషన్..
అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ పాసై సాధించి ఉండాలి.
ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
SSCW (నాన్ టెక్) (నాన్ యూపీఎస్సీ) పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
SSCW (టెక్) పోస్టులకు ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
ఏజ్ లిమిట్
అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. 1997 ఏప్రిల్ 2 నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్యలో జన్మించి ఉండాలి.
విధి నిర్వహణలో అమరులైన వారి భార్యల (వితంతువుల) వయస్సు కచ్చితంగా 2024 ఏప్రిల్ 1 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి.
సెలక్షన్ ప్రాసెస్
అభ్యర్థులను వారి గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తరువాత వీరికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ముఖ్యంగా సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో 2 రౌండ్స్‌లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్‌లో క్వాలిఫై అయిన వారినే సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూకు తీసుకుంటారు. ఇందులో కూడా సక్సెస్ అయితేనే.. మెడికల్ టెస్టులను నిర్వహించి, ట్రైనింగ్ కు తీసుకుంటారు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ఇంటర్వ్యూ ఉంటుంది.
ట్రైనింగ్ - శాలరీస్
సెలక్ట్ అయిన విద్యార్థులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, చెన్నైలో 2024 ఏప్రిల్ నుంచి ట్రైనింగ్ మొదలవుతుంది. అక్కడ 49 వారాల పాటు వీరికి ట్రైనింగ్ ఇస్తారు. ఈ సమయంలో నెలకు రూ.56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. ఎవరైతే ఈ ట్రైనింగ్ ను సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేస్తారో.. వారికి మద్రాస్ యూనివర్సిటీ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని కూడా అందిస్తారు. తరువాత వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది.
ఎంపికైన అభ్యర్థులు 10 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తి మేరకు కొందరిని పర్మినెంట్ ఉద్యోగాలకు తీసుకుంటారు. మిగిలిన వారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్ పొడిగిస్తారు. తరువాత వీరి సర్వీస్ ముగిసిపోతుంది.
ప్రమోషన్స్
లెఫ్టినెంట్ విధుల్లో చేరిన తరువాత, 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల అనుభవంతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను చేరుకోవచ్చు.