మేఘా-చైనా కంపెనీ డీల్‌కు కేంద్ర సర్కారు నో

Update: 2023-07-23 07:37 GMT

తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రాజెక్టులు చేపడుతున్న మేఘా కంపెనీ ఓ కీలక ప్రాజెక్టును కోల్పోయింది. చైనా కంపెనీతో కలసి హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి కంపెనీ చేసిన ప్రతిపాదనను కేంద్ర తిరస్కరించింది. సమస్యలున్న పొరుగు దేశాలతో కలసి కీలక ప్రాజెక్టులు చేపడితే భద్రతా సమస్యలు తలెత్తుతాయనే కారణంతో అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.

మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌, చైనాకు చెందిన బీవైడీ మోటర్స్‌ తెలంగాణలోల రూ.8 వేల కోట్లతో విద్యుత్ కార్ల తయారు ప్లాంటును ఏర్పాటు చేయాలనుకున్నాయి. ఏటా 15 వేల కార్లు తయారు చేయాలన్నది లక్ష్యం. అయితే దేశంలో ఇప్పటికే బీవైడీ వాహనాలు తిరుగుతున్నాయి. మేఘా అనుబంధ సంస్థ ఒలెక్ట్రా ట్రీన్‌టెక్ బీవైడీ నుంచి సాంకేతిక సాయంతో బస్సులను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలో జాయింట్ వెంచర్‌కు అనుమతి ఇవ్వాలని మేఘా కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. దేశంలో ఇప్పటికే పలు చైనా కంపెనీలు మొబైల్ టెక్నాలజీతోపాటు పలు రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తుండడం, ఆ దేశంతో ఘర్షణల నేపథ్యంలో కేంద్రం కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడంతో ఆచితూచి స్పందిస్తోంది.

Tags:    

Similar News