దళితుడిపై ఎమ్మెల్యే దాష్టీకం..

Update: 2023-08-12 04:28 GMT

రాజస్థాన్‎లో అమానవీయ సంఘటన జరిగింది. ఓ 51 ఏళ్ల దళిత వ్యక్తిపై ఓ పోలీస్ అధికారి ప్రవర్తించిన తీరు సభ్యసమాజం సిగ్గుపడేలా చేసింది. ఎమ్మెల్యే అనుమతి లేకుండా పొలంలోకి దిగావంటూ దళితుడిపై దారుణంగా ప్రవర్తించాడు డీఎస్పీ శివ కుమార్. ఈ సంఘటన జులై 30న జరగగా బాధితుడి ఫిర్మాదు మేరకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడితో ఎమ్మల్యే బూట్లు నాకించడంతో పాటు మూత్ర విజర్జన కూడా చేసి అత్యంత దారుణంగా వ్యవహరించారు.

బాధితుడు ఇచ్చిన వివరాల ప్రకారం.."నా భార్యతో కలిసి జూన్ 30న పొలం పనులు చేసుకుంటున్నాను. ఉన్నట్లుండి పోలీసులు నాపై దాడి చేసి నన్ను ఎమ్మెల్యే గోపాల్ మీణా ఇంటికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పర్మీషన్ లేకుండా పొలం పనులు ఎలా చేస్తావ్ అంటూ పోలీసులు నన్ను బెదిరించారు. డీఎస్పీ శివకుమార్ నాపై మూత్రవిసర్జన చేశారు. అక్కడితో ఆగలేదు ఎమ్మల్యే బూట్లు నాకించారు. ఎవరికైనా ఈ విషయం చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నన్ను బెదిరించారు. నా ఫోన్‎ను సైతం లాగేసుకున్నారు. డీఎస్పీ, ఎమ్మేల్యేల భయంతోనే ఇన్నాళ్లు వారిపై కంప్లైంట్ ఇవ్వలేదు. మొదట అసలు పోలీసులు నా ఫిర్యాదును పట్టించుకోలేదు. మొత్తానికి 27న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. కోర్టు ఆదేశాల తరువాత వారిపై కేసు నమోదైంది" అని బాధితుడు తెలిపాడు.

Tags:    

Similar News