టీచర్ను వెక్కిరిస్తూ ఇన్స్టా రీల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Update: 2023-08-15 12:23 GMT

ఉపాధ్యాయులపై విద్యార్థులకుండే గౌరవ మర్యాదలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయనడానికి నిదర్శనం ఈ ఘటన. అంధుడైన తమ టీచర్ ను ఆదర్శంగా తీసుకోకుండా.. ఈ కాలేజ్ విద్యార్థులు క్లాస్ రూంలో అవమానించారు. అంతేకాదు వెక్కిరిస్తూ వీడియోలు తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇంకేముంది అది కాస్త వైరల్ గా మారడంతో విషయం కాలేజ్ యాజమాన్యం దృష్టికి వెళ్లింది. కేరళలోని ఎర్నాకుళం మహారాజా కాలేజీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే కాలేజీలో పొలిటికల్ సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నాడు ప్రియేష్. అదే కాలేజీలో చదువుకుని టీచర్ గా మారాడు. క్లాస్ చెప్పడానికి వెళ్లగా.. అతని చుట్టూ చేరిన స్టూడెంట్స్ వెక్కిరిస్తూ అవమానించారు. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విద్యా బుద్దులు నేర్పే గురువును అవమానించే స్థాయికి విద్యార్థులు దిగజారారని నెటిజన్స్ మండి పడుతున్నారు.




 


ఈ విషయం కాలేజ్ యాజమాన్య దృష్టికి రావడంతో సదరు విద్యార్థులను సస్పెండ్ చేశారు. అందులో కేరళ స్టూడెంట్స్ యూనియన్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ ఫాజిల్ కూడా ఉన్నాడు. దీనిపై స్పందించిన టీచర్ ప్రియేష్.. ‘ఒక గంట క్లాస్ తీసుకోవడం కోసం నేను రెండు గంటలు కష్టపడతా. ఈ స్థాయికి చేరుకోవడానికి జీవితంలో చాలా కష్టపడ్డా. నా బోధనను ఎగతాళి చేస్తూ రీల్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం బాధాకరం. నా ఫ్యామిలీ కూడా ఈ ఘటన వల్ల చాలా బాధపడ్డార’ని చెప్పుకొచ్చాడు. దీనిపై కాలేజ్ యాజమాన్యం కమిటీ వేసి విచారణ చేపట్టింది.




Tags:    

Similar News