ఇన్స్టాగ్రామ్ డౌన్.. యూజర్లు పరేషాన్

Update: 2023-06-09 06:18 GMT

ఇన్స్టాగ్రామ్ మళ్లీ డౌన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు తమ అకౌంట్లు యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ఇన్స్టా యూజర్లలో చాలా మంది ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు ఔటేజ్ మానిటరింగ్ ప్లాట్ ఫాం డౌన్ డిటెక్టర్ ప్రకటించింది. యూజర్లలో దాదాపు 56శాతం మంది ప్రాబ్లెం ఎదుర్కొంటున్నారు.


డౌన్ డిటెక్టర్ నివేదిక ప్రకారం చాలా మంది యూజర్లు ఇన్స్టాలో లాగిన్ కాలేకపోతున్నారు. మరికొందరు ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం, స్టోరీలు ఓపెన్ చేయలేకపోతున్నారు. వారికి సమ్ థింగ్ వెంట్ రాంగ్, దేర్ ఈజ్ యాన్ ఇష్యూ అండ్ ది పేజ్ కుడ్ నాట్ బీ లోడెడ్ అనే మెసేజ్ కనిపిస్తోంది. అయితే ఎంత మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారన్నది స్పష్టం గా తెలియలేదు. మరోవైపు ఇన్స్టాగ్రాం సైతం దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు.

ఈ ఏడాది ఇన్స్టా డౌన్ కావడం ఇది రెండోసారి. మార్చి9న కూడా యాప్ పనిచేయలేదు. టెక్నికల్ ప్రాబ్లెం కారణంగా యూజర్లు ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉంటే ఇన్ స్టా డౌన్ కావడంతో యూజర్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో మెటాను చెడుగుడు ఆడుకుంటున్నారు. ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందేమో అనుకున్నా కానీ యాప్ డౌన్ అయిందని తర్వాత తెలిసిందని ఒకరంటే.. మళ్లీనా.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు. నా వైఫై పనిచేయడంలేదేమో అనుకున్నా అని ఒకరు వారంలో ప్రతి 5 రోజులకు ఒకసారి ఇన్ స్టాగ్రాం డౌన్ కావడం పరిపాటిగా మారిందని మరో యూజర్ పోస్ట్ చేశారు.



Tags:    

Similar News