IOCL job Recruitment 2023 Notification : ఇండియన్ ఆయిల్‌లో 1,720 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Update: 2023-10-23 16:02 GMT

కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్) భారీ స్థాయిలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తోంది. రిఫైనరీల విభాగంలో 1,720 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గువాహటి, బరౌనీ, గుజరాత్‌, హల్దియా, మథుర, పానిపత్‌, దిగ్బోయ్, బొంగాయిగన్‌, పారాదీప్‌ రిఫైనరీల్లో ఈ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఐటీఐ నుంచి డిగ్రీ, డిప్లమా తదితర అర్హతలు ఉన్న అభ్యర్థులకు పోస్టులు ఉన్నాయి.

ఖాళీలు, పరీక్ష తేదీలు

ట్రేడ్‌ అప్రెంటిస్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌, ట్రేడ్‌ అప్రెంటిస్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తదితర పోసులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 3న రాత పరీక్ష నిర్వహించి, అదే నెల 13న ఫలితాలను వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు కేటగిరీలను బట్టి 12 నుంచి 24 నెలల పాటు శిక్షణ ఇస్తారు. అభ్యర్థుల కనీస వయసు అక్టోబర్‌ 31 నాటికి అభ్యర్థుల 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.iocl.com/ సంప్రదించవచ్చు.



 



Tags:    

Similar News